అంతరించిపోతున్న పిచ్చుకలు


 గ్రామాలలో అపురూపంగా పెరుగుతున్న పిచ్చుకలు ప్రతినిత్యం గ్రామంలో కిటకిట లాడుతూ రైతు నేస్తంగా ఉంటున్న పిచ్చుకలు గ్రామాల్లో అంతరించిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రేడియేషన్ కారణంగా కనుమరుగయ్యే ప్రమాదంగా మారింది. 10 సంవత్సరాల క్రితం ఎక్కడ చూసిన పిచ్చుకలతో ప్రతి ఇంటి ఆవరణలో నివాసాలు ఏర్పరచుకుని దర్జాగా బతికే పిచ్చుక‌ల‌ యొక్క ఆనవాళ్లు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. సెల్‌ఫోన్‌ టవర్ల రేడియేషన్ ప్రభావంతో పిచ్చుకలు కనుమరుగు అవుతున్నాయి. ఇదే పరిస్థితి నెలకొంటే రాబోయే తరాలకు పిచ్చుకలను ఫొటోల ద్వారా వీడియోల ద్వారా ఇలా ఉండేవి మా కాలంలో పిచ్చుకలు అని తెలిపే పరిస్థితులు ఏర్పడుతాయి. ఇటీవల కాలంలో కొత్తపేటకు చెందిన కే. కన్నన్ ఇంటి ఆవరణలో తాగునీరు వాటికి ఆహారం అందించడం వలన సుమారు 10 పిచ్చుకలు ఆవాసం కల్పించి వాటికి ఆశ్రయం కల్పిస్తున్నారు. గ్రామంలో ప్రశంసిస్తూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ చేస్తే పిచ్చుకల సంతతి పెంచి పిచ్చుకలను ఆదరించే వారిగా కొనియాడుతారు అని వారు తెలిపారు.