ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో నిందితుడి తల్లి సంచలన నిర్ణయం


సభ్యసమాజం తలదించుకునే సంఘటన. నడి రోడ్డుపై ఆడపిల్లలు వెళ్లాలంటే భపడే రోజులు వచ్చాయి. స్వాతంత్రనికి పూర్వం పరిస్దితి ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా పరిస్దితులు అలానే ఉన్నాయి. ఏ మాత్రం మార్పు కనబడటం లేదు. కాని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అందుకు నిదర్శనమే ప్రియాంక రెడ్డి హత్యాచారం..


ఇక నుండి ఆడపిల్లలను కనాలంటే తుపాకి ఆమె పుట్టగానే లైసెన్స్ కోసం అప్లై చేసుకోవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు జరిగిన ప్రియాంక రెడ్డి మరణానికి కారణం ఎవరని నిందించడం. ఇది ప్రభుత్వ వైఫల్యమా?, లేక పెట్రోలింగ్ పేరుతో రక్షక భటులు చేస్తున్న కాలయాపనా? లేదా ఇలాంటి మృగాలను కంటున్న తల్లిదండ్రులదా?. పిల్లలు పుట్టగానే వాడు పెరిగితే ఇలాంటి దుర్మార్గుడు అవుతాడని తెలిస్తే పురిట్లోనే గొంతుపిసికి చంపేయడం చేస్తారు కాని వాడు ఎలాంటివాడు అవుతాడో తెలియదు.


అందుకే కనడం తల్లి తప్పు కాదు. మరి పెంపకంలోని దోషమా, సమాజంలోని లోపమా. ఏది ఏమైనా ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్యాచారం విషయంలో నిందితుడి తల్లి తీసుకున్న నిర్ణయం నిజంగా మెచ్చుకోదగ్గదే. ఎందుకంటే సమాజంలో అందరు తల్లులు ఇలాగే ఆలోచిస్తే మగ మృగాలకు కూడా ఒంట్లో భయం పుడుతుంది. ఇకపోతే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి శివారులో జరిగిన ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో నిందితులను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధాన నిందితుల్లో ఒకడెన మహ్మద్ పాషాతో పాటు మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు.


అయితే నిందితుల్లో ఒకరైన మహ్మద్ పాషా నారాయణ్ పేట్ జిల్లా, మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై నిందితుడి తల్లి స్పందిస్తూ తమ కుమారుడు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయాలంటూ పేర్కొనడం గమనార్హం.


ఒక తల్లి ఇంతటి ఘోర నిర్ణయానికి వచ్చిందంటే ఆమె సాటి ఆడపిల్లగా ఆలోచించిందని అర్ధం. ఇకపోతే ప్రియాంక ను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మహ్మద్ పాషా కాగా మిగతా వారు జోల్లు శివ, నవీన్, చింతకుంట చెన్నకేశవులుగా గుర్తించారు. వీరంతా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వారని పేర్కొన్నారు.