హైదరాబాద్: వైద్యురాలిపై అత్యాచారం, హత్య సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ఓ వెటర్నరీ డాక్టర్‌కు అంతర్జాతీయ నగరం హైదరాబాద్ శివార్లలో రక్షణ లేకుండా పోయిన ఉదంతం అందరినీ ఆలోచనకు గురిచేస్తోంది. కామాంధుల అరాచకానికి బలయిన వైద్యురాలి వ్యవహారంలో పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని అర్థరాత్రి తిప్పించుకున్న తీరు ఆవేదన కలిగించిందంటున్నారు కుటుంబ సభ్యులు. ఇక.. అమ్మాయి అదృశ్యమై నిండు దుఃఖంలో ఉన్న తమను పోలీసులు పెట్టిన టార్చర్ మరింత కుంగదీసిందని కన్నీరు మున్నీరవుతున్నారు.
ఒకవైపు కూతురు కానరాని దిగులు.. మరోవైపు పోలీసుల సూటిపోటి మాటలు!