ఘనంగా ఈశ్వరిభాయ్ జయంతి..
సి.డబ్ల్యూ.సి. మెంబర్స్ కీ సత్కారం
-----------------------------------------------
నాలుగు దశాబ్దాల(1952 _1999) పాటు ప్రజా సేవారంగంలో పనిచేసి... తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి... కౌన్సిలర్ స్థాయి నుండి రాష్ట్ర కేబినెట్ మంత్రి గా సేవలంధించి...మహిళా.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయురాలు... మాజీ మంత్రి గీతారెడ్డి మాతృమూర్తి " అగ్నశిఖ" దివంగత ఈశ్వరిభాయ్ 101 జయంతి వేడుకలు సూర్యాపేట పట్టణంలో రైతు బజారు అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు.. పూర్వ ప్రభుత్వ సహాయ న్యాయవాది.. తలమల్ల హస్సేన్ నేపథ్యంలో 01/12/2019 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా గత కొన్ని రోజుల నుంచి మహిళలపై అత్యాచారాలు జరగటం, హత్య జరగడం విచారకరమని హైదరాబాదులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య , వరంగల్లో మానస హత్యలను మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని , రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో మద్యపానం ఏరులై పారుతుందని రాష్ట్రానికి ఆదాయ వనరుల కోసం మద్యం దుకాణాలను ఎక్కువ మొత్తంలో ప్రారంభించడం మద్యం మత్తు లో యువకులు మహిళలు విద్యార్థినులపై అరాచకాలు మానభంగాలు హత్యలు జరపటం కూడా ఒక కారణమని అన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర రావు గారు దళిత మహిళా మాతృమూర్తి ఈశ్వరీబాయి గారి జయంతోత్సవం సందర్భంగా ఈశ్వరీబాయి స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించి , మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించుటకు నూతన ఆలోచనలను చేయాలని కోరినారు .
ఈ కార్యక్రమంలో న్యాయ శ్రీ అవార్డు గ్రహీత.. పూర్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జే. శశిధర్.. మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దాసరి దేవయ్య , బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వసంత సత్యనారాయణ పిళ్లే... రిటైర్డ్ స్టేట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గోలి సాంబయ్య.. రిటైర్డ్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ బొల్లెద్దు గోపయ్య... రిటైర్డ్ తహసీల్దార్ పెరుమాళ్ల రాజారావు. బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సటు నాగయ్య. న్యాయవాదులు యం. యన్. వరప్రసాద్.. మాండ్ర మల్లయ్య.. ఎడ్ల ముక్కంటి.. లింగాయత్ వీరశైవ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల నాగరాజ్ అప్ప, తీగల యాదగిరి, నామ వేణు.. వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాతంగి వెంకన్న..కంచరదాసు ఆనందరావు...గాజుల నరసయ్య , కట్ట విజయ్ కుమార్ , బూరుగుల సుమన్ .. తదితరులు పాల్గొని ఈశ్వరిభాయ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు
చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా బాలల సంక్షేమం... వారి రక్షణ.. సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ... ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వ జువెనైల్ డిపార్టుమెంటు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ జుడీషియల్ బోర్డు మెంబర్స్ గా సేవలు అందిస్తున్న యాతాకుల సునీల్.., బొల్లెద్దు వెంకటరత్నం లను సభలో శాలువలతో సత్కరించి ఈశ్వరీభాయ్ గ్రంథాలను జ్ఞాపిక అందజేశారు